జాతీయ క్రీడలకు వెళ్లిన రాష్ట్ర బీచ్ హ్యాండ్‌బాల్ జట్ట
విజయవాడస్పోర్ట్స్: ఉత్తరాఖండ్‌లో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 38వ జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్ బీచ్ హ్యాండ్‌బాల్ జట్టు శుక్రవారం పయనమైనట్లు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.సత్యనారాయణరాజు తెలిపారు. జట్టులో చోటు దక్కించుకున్న ఎన్.రాము(విశాఖపట్నం), ఎస్.అమీర్(విశాఖపట్నం), కె.శ్రీను(విశాఖపట్నం), ఎ.జగదీష్(కర్నూలు), కె.శివకుమార్ (కర్నూలు), ఆర్.రియాజ్(కర్నూలు), ఎం.స్వామినాథన్(ప్రకాశం), కె.పవన్‌కల్యాణ్(చిత్తూరు), ఎల్.జనార్దనరెడ్డి (గుంటూరు), ఇ.రాజు(అనంతపురం) విజయవాడ నుంచి బయలుదేరారు. ఈ బృందానికి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీవోఏ) అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ట్రాక్‌షూట్, కిట్లు, జెర్సీలు సమకూర్చారని, అలాగే తమ సంఘం ప్రయాణ ఖర్చులను సమకూర్చిందని సత్యనారాయణరాజు తెలిపారు. జట్టు బృందాన్ని కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వంశీకృష్ణ, కోచ్ గోపీకృష్ణ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment