ఆ కులాల వారికి మద్యం షాపులు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గీత వృత్తిలో ఉన్న కులాల వారికి మద్యంషాపుల కేటాయింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ గీత కులాల్లోని ఉపకులాలైన గౌడ్, గౌడ, శెట్టిబలిజలకు లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించారు. ముందుగా జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి 123 మద్యం షాపులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 10 శాతం గీతకులాల వారికి కేటాయించాలని నిర్ణయించటంతో 12 మద్యంషాపులను కేటాయించినట్లు తెలిపారు.
● ‘గౌడ్’ కులం వారికి గుడివాడ, తాడిగడపల్లో ఒక్కొక్క షాపుతో పాటు పమిడిముక్కల మండలంలో ఒక షాపు కేటాయించారు.
● ‘గౌడ’ కులం వారికి మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు పెడన, గూడూరు, గుడివాడ, పెడన, కోడూరు, పెదపారుపూడి, బంటుమిల్లి మండలాల్లో ఒక్కొక్క షాపును కేటాయించారు.
● ‘శెట్టిబలిజ’ వారికి బందరు మండలంలో ఒక షాపు లాటరీ పద్ధతిలో కేటాయించారు.
ఆరో తేదీన లాటరీ..
ఈ షాపులకు ఆయా కులాల వారు ఫిబ్రవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, 7వ తేదీన దరఖాస్తుదారులకు లాటరీ తీసి కేటాయింపులు చేస్తామని జేసీ గీతాంజలిశర్మ తెలిపారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురు మూర్తి, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు, ఏఈఎస్ సి. భార్గవ్ పాల్గొన్నారు.
లాటరీ పద్ధతిలో 12 దుకాణాలు
కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment