![బెజవా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/10022025-v_kri_tab-02_subgroupimage_1878591184_mr-1739129039-0.jpg.webp?itok=KjlBSAa5)
బెజవాడలో తండేల్ చిత్ర యూనిట్ సందడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా యూనిట్ ఆదివారం నగరానికి చేరుకుంది. గాంధీనగర్‌లో చిత్రం ప్రదర్శిస్తున్న శైలజా థియేటర్‌లో నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు. తండేల్ చిత్రానికి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత యూనిట్ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నానన్నారు. నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ తండేల్ చిత్రంలో హీరో నాగ చైతన్య, సాయిపల్లవి తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశారన్నారు. డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ చిత్రాన్ని థియేటర్‌లోనే చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దన్నారు. నటుడు మహేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని తండేల్ ప్రదర్శించే థియేటర్‌లలో కుటుంబసభ్యులతో జరుపుకోవాలన్నారు. అనంతరం శైలజ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ప్రేక్షకులకు నాగచైతన్య అభివాదం చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న అక్కినేని ఫ్యాన్స్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
ముగిసిన శ్రీ సిద్ధేంద్ర యోగి జయంతి నాట్య మహోత్సవాలు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళావేదికపై గత రెండురోజులుగా సాగుతున్న శ్రీ సిద్ధేంద్ర యోగి జయంతి నాట్య మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ నాట్యోత్సవాల్లో అమెరికా, విజయవాడ, కొత్తగూడెం, హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి కళాకారులు పాల్గొన్నారు. చదలవాడ ఆనంద్ (విజయవాడ) శిష్యురాలు నాదపద్మ, శ్రీ దుర్గా సాయి నృత్యనికేతన్ (కొత్తగూడెం) ప్రిన్సిపాల్ సీతాలక్ష్మీప్రసాద్ పర్యవేక్షణలో ఆర్.మనీషా ఎస్.శ్రీనిజ,లక్ష్మీబాబు (యూఎస్‌ఏ) శిష్యురాలు నందిపల్లి సాహితి, శ్రీ నృత్యకళానిలయం (విజయవాడ) నిర్వాహకురాలు గోనుగుంట శైలశ్రీ ఆధ్వర్యంలో జి.సత్యానందిని, జి.రమ్య సాహితి, శ్రీ శంకరగిరి నాథ..కూశ్రీ లలిత స్కూల్ ఆఫ్ డ్యాన్స్ (హైదరాబాద్) ప్రిన్సిపాల్ డాక్టర్ వై.లలితా సింధూరితో పాటు శిష్యులు రిత్విక, రుత్వి, తన్వి, రితిక వివిధ నృత్యాంశాలను ప్రదర్శించారు.
![బెజవాడలో తండేల్ చిత్ర యూనిట్ సందడి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09vic163-310137_mr-1739129039-1.jpg)
బెజవాడలో తండేల్ చిత్ర యూనిట్ సందడి
Comments
Please login to add a commentAdd a comment