పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక చొరవ
● జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
ఓర్వకల్లు: పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఓర్వకల్లు ప్రాంతంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూములపై తహసీల్దార్ విద్యాసాగర్‌ను ఆరా తీశారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూములకు సంబంధించిన ఫీల్డు మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం ఏపీఐఐసీ, జైరాజ్ స్టీల్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. అలాగే మెగా ఇండస్ట్రీయల్ హబ్‌కు సంబంధించి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పైపులైన్ పనులు 50 శాతం పూర్తయినట్లు సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పారిశ్రామిక వాడ భూముల్లో జరుగుతున్న అంతర్గత రోడ్ల పనులను పరిశీలించి, వచ్చే మూడు నెలల్లోపు పునులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది హాజరు శాతంపై ఆరా తీశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే కొత్తగా ఓటరు నమోదుకు ఏమైన దరఖాస్తులు వచ్చాయా? అధికారులను ఆరాతీశారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ ఇన్‌చార్జ్ జీఎం అరుణ, తహసీల్దార్ విద్యాసాగర్, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment