పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం చేయొద్దు
కర్నూలు(సెంట్రల్): పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా గడువులోపు ఇవ్వాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...సింగిల్ డెస్కులో వచ్చిన దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, భూగర్భజలాలు తదితరశాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని గడువులోపు పరిశీలించాలని ఆదేశించారు. త్వరలో జరిగే ఎంఎస్‌ఎంఈ సర్వే కోసం 27వ తేదీన మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలకు, 28వ తేదీన సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎంకు సూచించారు. కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో మౌలిక వసతులైన నీరు, డ్రెయినేజీలు, రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా జైరాజ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ కోసం బ్లాస్టింగ్‌లు చేయాలన్నారు. పారిశ్రామిక ప్రోత్సహాకాలకు సంబంధించి 39 క్లెయిమ్‌లకు 3.48 కోట్ల రుణాల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జీఎం అరుణ, ఏపీఐఐసీ జీఎం శ్రీనివాసరెడ్డి, ఐలా చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్, మత్స్య్శశాఖ అధికారి శ్యామల, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవిపాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్
పి.రంజిత్‌బాషా ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment