18 ఏళ్లు నిండి వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
కర్నూలు(సెంట్రల్): 2025 జనవరి ఒకటో తేదీ నాటికీ 18 ఏళ్లు నిండే యువతీ, యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శనివారం స్పెషల్ సమ్మరీ రివిజన్–2025లో భాగంగా ఎస్టీబీసీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టామన్నారు. ఇందులో ఓటరుగా నమోదు కావడం, ఓటరుజాబితాలోమార్పులు, చేర్పులు చేసుకోవడానికి దరఖాస్తులు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాక స్పెషల్ సమ్మరీ రివిజన్–2025కు సంబంధించి విడుదల చేసిన ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉన్నా తెలపవచ్చన్నారు. అంతకు ముందు ఆయన ఫారం–6, 7, 8 దరఖాస్తులు ఎన్ని వచ్చాయని బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఆదివారం కూడా అందుబాటులో ఉంటాయని, ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ ప్రశాంతి సామ్ ఉన్నారు.
కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment