వదిన, మరిది ఒకే రోజు మృతి | - | Sakshi
Sakshi News home page

వదిన, మరిది ఒకే రోజు మృతి

Published Sun, Nov 24 2024 5:29 PM | Last Updated on Sun, Nov 24 2024 5:29 PM

వదిన,

వదిన, మరిది ఒకే రోజు మృతి

● శోక సంద్రంలో కుటుంబసభ్యులు, బంధువులు

జూపాడుబంగ్లా: అన్న భార్య వదిన మృతిచెందటంతో ఆమె అంత్యక్రియలకు వచ్చిన మరిది గుండెపోటుతో మృతిచెందిన ఘటన మండలంలోని తర్తూ రు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తర్తూరు గ్రామానికి చెందిన సుజాతమ్మ(65) అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న నందికొట్కూరులో ఉంటున్న ఆమె మరిది జగదీశ్వరరావు(62) కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తర్తూరు గ్రామానికి వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న జగదీశ్వరరావు సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోగానే మృతిచెందాడు. ఉదయం సుజాతమ్మ, సాయంత్రం జగదీశ్వరరావు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇద్దరి అంత్యక్రియలు శనివారం తర్తూరు గ్రామంలోనే నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వదిన, మరిది ఒకే రోజు మృతి 1
1/1

వదిన, మరిది ఒకే రోజు మృతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement