అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
నందికొట్కూరు: పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన ప్రవీణ్‌కుమార్(23) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దేవదాసు, ఎస్తేరమ్మ దంపతుల కుమారు డు ప్రవీణ్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదో డుగా ఉండేవాడు. శనివారం కొణిదేల గ్రామం బీసీ కాలనీకి చెందిన చేపల నరసింహుడి బొలేరో వాహనం వద్ద దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా ప్రవీణ్‌కుమార్ మృతిచెంది ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఎవరో హత్య చేశారని, పూర్తిస్థాయిలో విచారించి నిందితులను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి,సుబ్రహ్మణ్యం డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించా రు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment