నాయీ బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
కర్నూలు (అర్బన్): నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సూచించారు. శనివారం నాయీ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (నోపా) ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం, నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, నోపా గౌరవ అధ్యక్షులు సీహెచ్ నవీన్ కుమార్, అధ్యక్షులు ఎం.వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి న్యాయవాది మద్దిలేటి హాజరై మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నోపా ప్రతిభా పురస్కారాల్లో భాగంగా రూ.20 వేలను ప్రోత్సాహకంగా అందించారు. కార్యక్రమంలో నోపా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధన విజయుడు, నాయీ బ్రాహ్మణ అఖిలభారత నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు శివయ్య, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఎం.శాంతకుమార్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment