కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం అధునాతన టెస్టింగ్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కాంప్లెక్స్‌లో ఉన్న రీజినల్ ఎకై ్సజ్ లేబరేటరీని కలెక్టర్ సందర్శించారు. కొత్తగా వచ్చిన టెస్టింగ్ మిషినరీ, ఇన్‌స్ట్రూమెంట్ల ద్వారా ల్యాబొరేటరీలో జరుగుతున్న అన్ని రకాల పరీక్షలు, టెస్టింగ్ పద్ధతులు, రిపోర్టులు పొందుపరిచే వివరాలు, పరికరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు డిస్టిలరీస్‌లో తయారయ్యే మద్యం నాణ్యతను, పరిమాణాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం గ్యాస్ క్రొమోటోగ్రఫీ, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ (ఏఏఎస్) యంత్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ యంత్రాల ద్వారా మద్యం నాణ్యతను, పరిమాణాన్ని పరీక్షించడం జరుగుతోందన్నారు. హయ్యర్ ఆల్కహాల్స్, కాపర్, లెడ్ లాంటి లోహాలు పరిమితి లోపు ఉన్నాయా లేదా పరీక్షించి నాణ్యమైన మద్యంను అందించడం జరుగుతోందన్నారు. అనంతరం కలెక్టర్ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, కెమికల్ ఎగ్జామినర్ హరిత, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment