నంద్యాల(అర్బన్): జిల్లాలోని బేకరి షాపులు, కిరాణం షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని తేలడంతో 10 కేసులు నమోదు చేసి రూ.2.10 జరిమానా విధించినట్లు ఆహార భద్రతా అధికారి వెంకటరాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సింతటిక్ ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ఆహార పదార్థాల్లో వాడారని, వాటిని రసాయనిక పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపామన్నారు. హోటళ్ల యజమానులు శుభ్రత పాటించకపోతే ఆహార భద్రత చట్టం ప్రకారం శిక్షలు తప్పవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment