గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
కోసిగి: మండల కేంద్రంలోని పెద్ద మసీదు సమీపంలో నివాసం ఉంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముద్దమ్మ గారి నాగరాజు(45) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కొన్నిరోజులుగా భార్య పుట్టినిల్లు కందుకూరు గ్రామంలో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. అందులోభాగంగానే శనివారం తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. స్థానిక వైద్యులు వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని కోసిగికు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు కోసిగికు చేరుకుని మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం డిపో తరపున రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. నాగరాజుకు భార్య నాగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈఎన్‌టీ శస్త్రచికిత్సలపై శిక్షణ
కర్నూలు(హాస్పిటల్):నగరంలోని ఎన్‌ఆర్ పేట లోని శ్రీ సత్యసాయి ఈఎన్‌టీ హాస్పిటల్ లో రెండు రోజులపాటు నిర్వహించే 34వ హ్యాండ్స్ ఆన్ ఆసిక్యులోప్లాస్టీ, టింపనోప్లాస్టీ, మైక్రో ఇయర్ సర్జరీ ఈఎన్‌టీ శస్త్రచికిత్సల వర్క్‌షాప్ శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌నకు దుబాయి నుంచి ముగ్గురు వైద్యులతోపాటు ఏపీ, తెలంగాణా, కర్ణాటక, ఒడిస్సా, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ నుంచి 20 మంది నూ తన వైద్యులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ బి.జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చెవి, ముక్కు కు సంబంధించిన సూక్ష్మ ఎముకలు, ఇతర పరికరాలను సేకరించడం కష్టమని, అందువల్ల ఇలాంటి వర్క్‌షాప్ లు అరుదుగా నిర్వహిస్తారన్నారు. ఈ వర్క్‌షాప్‌లో తనతోపాటు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ నదీమ్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ కుమార్‌చౌదరి శిక్షణ అందించారన్నారు. గతంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లలో శిక్షణ పొందిన వైద్యులు తమ నైపుణ్యత పెంపుదలకు ఈ వర్క్‌షాప్ బాగా తోడ్పడిందన్నారు.
మెరిసిన యశ్వంత్
● ఐఈఎస్‌లో ఆల్‌ఇండియా 18వ ర్యాంక్
దొర్నిపాడు: మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నాగరాజు కు మారుడు గడ్డిపాటి యశ్వ ంత్‌కుమార్ ఇండియన్ ఇ ంజినీరింగ్ సర్వీస్‌లో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించారు. యశ్వంత్‌కుమార్ పదవ తరగతిలో 10కి పది పాయింట్లు, ఇంటర్ ఎంపీసీలో 984 మార్కులు సాధించాడు. అనంతరం బాంబే ఐఐటీలో సీటు సాధించి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైన్నెలో ఉద్యోగం పొందాడు. యూపీఎస్సీ నిర్వహించిన ఐఈఎస్‌లో 18వ ర్యాంక్‌ను మొదటి ప్రయత్నంలోనే సాధించి తన కలను నెరవేర్చుకున్నాడు.
గేట్‌లోనూ ప్రతిభ
ఎంటెక్ కోసం నిర్వహించే గేట్‌లో ఆల్‌ఇండియా 17వ ర్యాంక్ సాధించాడు. అలాగే ఎన్విరాల్‌మెంట్ సైన్స్‌లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్టుమెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగం పొందాడు. వాటితోపాటు ఐండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ 18 ర్యాంక్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment