గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు–దూపాడు రైల్వేస్టేషన్ల మధ్య 243/17–18 కిలోమీటర్ వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడు. కర్నూలు రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ నాగరాజుకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో రైల్వే పీఎస్ ఎస్‌ఐ కిరణ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి వాహనం కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. కాగా ఆచూకీ తెలిసినవారు 9440627654కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.
చెట్టుకు ఉరి వేసుకుని మరో యువకుడు..
మంత్రాలయం: గుర్తు తెలియని ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా మృతుడు మండల కేంద్రంలోకి కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రిపూట గతంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోనే బస చేసేవాడు. ఇటీవల రాత్రి పూట బయట ప్రాంతాల్లో బస చేస్తూ కనిపించాడు. ఆదివారం రాత్రి స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుటనే ఉన్న కట్టెల డిపోలో కానుగ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఉదయం కట్టెల డిపో వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీఆర్వో భీమన్న గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎ.ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment