కర్నూలు కల్చరల్: ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలకు కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారి ‘శ్రీకృష్ణ కమలపాలిక’ పద్య నాటకం ఎంపికై ందని కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. జనవరి 18 నుంచి 30వ తేదీ వరకు ఒంగోలులోని ఈదర హరిబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నాటిక, సాంఘిక, పౌరాణిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ కమల పాలిక నాటకం ఎంపికై నట్లు నిర్వాహకులు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ నాటకం జనవరి 19వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రదర్శితమైతుందని పేర్కొన్నారు. పల్లేటి కులశేర్ రచనలో, పత్తి ఓబులయ్య దర్శకత్వంలో ఈ నాటకం ఇప్పటికే పలు పోటీల్లో పాల్గొని ఉత్తమ నాటక అవార్డులు కై వసం చేసుకుంది. రాయలసీమ జిల్లాల నుంచి ఎంపికై న ఏకై క నాటకం కావటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment