బండి ఆత్మకూరు: మండల పరిధిలోని ఈర్నపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రైతుకు బద్రి చంద్రకాంత్‌కు చెందిన రెండు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పక్కనున్న గడ్డి వాములకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రమాదవశాత్తూ జరిగిందా, ఆకతాయిల పనేనా అనే విషయం తెలియాల్సి ఉంది.
ఎన్‌ఎంఎంఎస్ తుది కీ విడుదల
కర్నూలు సిటీ: ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష ఫలితాల తుది కీ విడుదల చేసినట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9న ప్రైమరీ కీ విడుదల చేసి, 16 వరకు వెబ్‌సైట్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిపారు. వీటి ఆధారంగా ఫైనల్ కీ విడుదల చేశామని పరీక్ష రాసిన విద్యార్థులు చూసుకునేందుకు డీఈఓ ఆఫీస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment