ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు పీవీ
కర్నూలు(అర్బన్): భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు ఆద్యులు భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహరావు అని నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పీవీ వర్ధంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి బ్రాహ్మణ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 1991 నుంచి 1996 వరకు దేశ 9వ ప్రధానిగా పనిచేసిన పీవీ బహు భాషా వేత్త, రచయిత అన్నారు. 1957లో రాజకీయ జీవితం ప్రారంభించిన పీవీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పనిచేశారన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తగిన సంఖ్యా బలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చతురతతో పూర్తి కాలం నడిపించారన్నారు. బ్రాహ్మణుడైన పీవీ కులపరంగా బలమైన రాజకీయ వర్గం లేకపోయిన తనకున్న తెలివితేటలు, రాజకీయ అనుభవంతో దేశ రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియడారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు చెరువు వెంకటదుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి చల్లా నాగరాజుశర్మ, ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాంసుందర్‌రావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్‌రావు, గౌరవ సలహాదారులు సముద్రాల శ్రీధర్‌బాబు, బ్రాహ్మణ నేతలు టీవీ రవిచంద్రశర్మ, శ్రీనివాసరాజు, రాధాక్రిష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment