శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమ వారం వెండిరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. సహస్ర దీపార్చన సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment