జవాన్‌కు జనాభివందనం
దేశ రక్షణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఉగ్రమూకలను అంతమొందించి శౌర్య పురస్కారాన్ని అందుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్ పత్తికొండకు చెందిన బొల్లం రామాంజనేయులుకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం పత్తికొండకు చేరుకున్న జవాన్‌కు పట్టణంలోని యువత, విద్యార్థులు జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. వందేమాతరం, జై జవాన్ నినాదాలు మిన్నంటాయి. సీఐ జయన్న, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వీరేశప్పతో పలువురు జవాన్‌ను ఘనంగా సత్కరించారు. – పత్తికొండ(తుగ్గలి)
Comments
Please login to add a commentAdd a comment