కరెంట్ చార్జీల బాదుడుపై ‘పోరుబాట’
కర్నూలు (టౌన్): కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాటకు పిలుపునిచ్చిందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్‌రెడ్డి అన్నారు. పెంచిన చార్జీలు తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 27వ తేదీ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, విద్యుత్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ నాయకులతో కలిసి ‘ కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట’ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సోలార్, విండ్, హైడల్ ప్రాజెక్ట్‌లను వాడుకుంటూ ఒక్క పైసా కూడా చార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ఎడాపెడా విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రెండు సార్లు ప్రజలపై భారం మోపి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పిందేమిటో.. అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్నదేమిటో ప్రజలకు వివరిస్తామన్నారు. జగనన్న హయాంలో విద్యుత్ చార్జీలు యూనిట్ రూ.2.90 పైసలు ఉంటే ఇప్పుడు 4.80 పైసలు చంద్రబాబు నాయుడు పెంచారన్నారు.
బాబు నూతన కానుక భారం రూ.15,483 కోట్లు
బాబు నూతన సంవత్సర కానుకగా ప్రజలపై రూ.15,483 కోట్లు భారం మోపారని ఎస్వీ అన్నారు. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు వివిధ పన్నులు పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కాకపోవడంతో కళాశాలలు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నాయని, కొన్ని చోట్ల యాజమాన్యాలు తల్లిదండ్రులతో లెటర్లు రాయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఒడి, ఆడబిడ్డకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇలా.. ఏ ఒక్కటి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా 3 లక్షలకు పైగా పెన్షన్లను వివిధ సాకులు చూపి తొలగించిందని మండిపడ్డారు.
● వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు అహమ్మద్ అలీఖాన్, గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తున్నారన్నారు. దళితులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బిల్లులో వెసులుబాటు కల్పిస్తే కూటమి సర్కారు ఆ పేదల నుంచి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, కార్పొరేటర్లు శశికాంత్ రెడ్డి, యూనుస్‌బాషా, షేక్ అహమ్మద్, జుబేర్, పార్టీ నాయకులు రాఘవేంద్ర నాయుడు, అనిల్‌కుమార్, బెల్లం మహేశ్వర రెడ్డి, ప్రశాంత్, రైల్వే ప్రసాద్ పాల్గొన్నారు.
27న జిల్లా వ్యాప్తంగా
వైఎస్సార్‌సీపీ నిరసనలు
జనవరి నుంచి ప్రజలతో కలిసి
‘బాబు బాదుడు’పై ఆందోళనలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment