బండెడు చాకిరీ!
● సచివాలయాల్లో ఇంజినీరింగ్
అసిస్టెంట్లపై అదనపు భారం
● విద్యార్హతలు, సామర్థ్యానికి
వ్యతిరేకంగా విధులు
● సంబంధం లేని పనులు
చేయిస్తుండడంతో ఈఏల పరేషాన్
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పరిస్థితి అందోళనకరంగా తయారైంది. బీటెక్, ఎంటెక్ చదివి కష్టపడి పరీక్ష రాసి సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తాము చేయాల్సిన పనులేంటో, చేస్తున్న పనులేంటో తెలియక తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుతీరినప్పటి నుంచి ఇంజినీరింగ్ అసిస్టెంట్ల విద్యార్హతలు, సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారి జాబ్‌చార్ట్‌లో లేని పనులను అప్పగిస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి ఒక ఉద్యోగానికి జీతం ఇస్తు వంద రకాల పనులను చేయిస్తున్నారు. టెక్నికల్ పనులతో పాటు నాన్ టెక్నికల్ పనులను కూడా వీరితోనే చేయిస్తుండడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థతను ఏ ర్పాటు చేస్తూ పలు శాఖల ఉద్యోగులను నియమించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 863 సచివాలయాల్లో 751 ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. నియామక సమయంలో జారీ చేసిన జాబ్‌చార్ట్‌ను కూటమి ప్రభు త్వం పక్కనబెట్టి అనేక రకాల సంబంధం లేని పనులు చేయిస్తుండడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. జాబ్ చార్ట్ ప్రకారం క్షేత్ర స్థాయిలో వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంది. అలాగే తమ పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ( సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్స్, బీటీ రోడ్లు, నీటి ట్యాంకుల నిర్మాణం, డ్రైనేజీ, గ్రామీణ నీటి సరఫరా తదితర వాటిని గుర్తించాల్సి ఉంది. గ్రామ సభ ఆమోదంతో గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించిన పనులకు అంచనాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, వరదలు సంభవించిన స మయాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన ఓఅండ్ ఎం స్టాఫ్‌తో కలిసి తాగునీటి పైప్‌లైన్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. సమయానుకూలంగా తమ కాంపిటెంట్ అథారిటీ అధికారులు సూచించిన ఇతర పనులకు హాజరు కావాల్సి ఉంటుంది.
విధి నిర్వహణలో భాగంగా ...
‘ పల్లె పండుగ ’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉపాధి నిధులు రూ.67 కోట్లతో 830 పనులు ( గ్రామీ ణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు ) చేపట్టారు. ఈ పనులు పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఈ పనులను ఈఏలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు చెందిన పనులను కూడా నిర్ణీత సమయంలోగా చేపట్టాలని ఆదేశాలు జారీ అవుతున్నందున ఈఏలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. హౌసింగ్‌లో తగినంత మంది సిబ్బంది లేని కారణంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లతోనే కాలం నెట్టుకొస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సచివాలయాల వివరాలు....
జిల్లా సచివాలయాలు ఇంజినీరింగ్
అసిస్టెంట్లు
కర్నూలు 463 366
నంద్యాల 400 385
మొత్తం: 863 751
Comments
Please login to add a commentAdd a comment