భాగ్యలక్ష్మి
నెహ్రూసెంటర్ : మెరుగైన చికిత్స కోసం వచ్చిన ఓ బాలింత మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలి భర్త వడ్డూరి వెంకటేష్ కథనం ప్రకారం..జిల్లాలోని మరిపెడకు చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మి (23) రెండో కాన్పు కోసం వచ్చి మరిపెడ పీహెచ్‌సీలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఉదయం 10.45 గంటలకు ప్రసవం జరిగిన కొంత సమయం నుంచి ఆమె మానసిక స్థితి సరిగాలేనట్లుగా ప్రవర్తించింది. విధుల్లో ఉన్న మరిపెడ పీహెచ్‌సీ డాక్టర్ రవి ఆమెకు చికిత్స అందించారు. సాయంత్రం 3 గంటల సమయంలో భాగ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. మెరుగైన వైద్యం కోసం మానుకోటకు తీసుకురాగా పరీక్షించిన వైద్యులు వైద్య చికిత్స మొదలుపెట్టారు. కొంత సమయం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమెకు ఆయాసం తగ్గకపోవడంతో వరంగల్‌కు తీసుకెళ్లమని సూచించారు. వెంటనే అంబులెన్స్ ఎక్కిస్తుండగా మృతి చెందింది. మరిపెడ వైద్యాధికారి నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని వెంకటేష్ ఆరోపించాడు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment