![క్రీడలతో తెలంగాణ కీర్తిని చాటాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10wgl201-330127_mr-1739216956-0.jpg.webp?itok=-KcgrRXy)
క్రీడలతో తెలంగాణ కీర్తిని చాటాలి
మామునూరు : క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి, తెలంగాణ కీర్తిని చాటాలని కేయు ప్రొఫెసర్ కె.రాంచందర్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి పేర్కొన్నారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దే వి ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో హనుమకొండ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ము ఖ్యఅతిథులుగా వారు హాజరై పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులును పరిచయం చేసుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. మరుగున పడిపోతున్నా గ్రామీణ క్రీడలను వెలికితీసి ప్రోత్సహించే ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలువగా.. రెండు, మూడో స్థానంలో మెదక్, రంగారెడ్డి జట్లకు ట్రోఫీ, బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి.సాంబశివ రావు, నీవన్, అభిషేక్, కోచ్ కృష్ణ, ప్రమోద్‌కుమార్, అశోక్‌బాబు, అభినవ్, వినయ్‌కుమార్, రాజేశ్వర్, నాగరాజు, సుమలత, వినయ్, మధు, సృజన, రవి, శశాంక్, ప్రశాంత్, భగత్, లక్ష్మీపతి, నరేశ్, అర్జున్, సుష్మ, వెన్నెల,పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment