మినీ మేడారం జాతరను పోలీసు శాఖ నాలుగు రూట్లుగా విభజించింది. 15 రోజుల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో రూట్లను ఏర్పాటు చేసి అధికారులను కేటాయించింది.
రూట్–1
హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు పస్రా–వెంగళాపురం–నార్లాపూర్–కొత్తూరు మీదుగా జంపన్నవాగు, హరిత జంక్షన్ ద్వారా ఐటీడీఏ గెస్ట్ హౌస్ వెనుక నుంచి అమ్మవారి ఎదురుకోళ్ల గుడి పక్కకు చేరుకుని ఇక్కడ పార్క్ చేయాలి. ఎదురుకోళ్లగుడి పార్కింగ్‌లో స్థలం లేకపోతే వాహనాలకు హరిత హోటల్, ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఎదుట పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. తిరుగు ప్రయాణంలో హరిత వై జంక్షన్, ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఆర్టీసీ బస్టాండ్, ఎలుబాక మీదుగా చింతల్ క్రాస్‌కు చేరుకునేలా రూట్ ఏర్పాటు చేశారు.
రూట్–2
భూపాలపల్లి, కరీంనగర్ మీదుగా వచ్చే భక్తుల వాహనాలు నార్లాపూర్, కొత్తూరు, జంపన్నవాగు మీదుగా ఎదురుకోళ్లగుడికి చేరుకోవాలి. తిరుగు ప్రయాణం రూట్–1 వాహనాలతో పాటే చింతల్ క్రాస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
రూట్–3
ఛత్తీస్‌గఢ్, భద్రాద్రికొత్తగూడెం, ఏటూరునాగారం ప్రాంతాల వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలో అమ్మవారి ఆర్చ్ మీదుగా మేడారం సమీపంలోని శ్రీరాంసాగర్ చెరువు నుంచి వీఐపీ పార్కింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణం కూడా ఇదే రూట్‌లో ఉంటుంది.
రూట్–4
హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పస్రా–ఎస్‌ఎస్‌తాడ్వాయి మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. భూపాలపల్లి, కరీంనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు చింతల్ క్రా స్–ఎలుబాక మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి జంపన్నవాగు, అమ్మవారి గద్దెలకు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల సంఖ్య తక్కువ ఉంటే స్థానికంగా ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. ఇక వీవీ ఐపీ పార్కింగ్‌కు నేరుగా వెళ్లాలనుకునే భక్తులు శ్రీరాంసాగర్‌చెరువు మీదుగా చేరుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment