![మరోసారి అవకాశం ఇవ్వండి..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10wgl277-330090_mr-1739216956-0.jpg.webp?itok=sT5mDP6p)
మరోసారి అవకాశం ఇవ్వండి..
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని, మరోసారి మొదటి ప్రాధాన్యత ఓటువేసి తనను గెలిపించాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. సోమవారం ఉదయం కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓటు అభ్యర్థించారు. ఉన్నత విద్యారంగంలో పలు సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కృషిచేశానని, మరోసారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కళాశాలకు తన సీడీపీ నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేయించానని గుర్తుచేశారు. మళ్లీ అవకాశం ఇస్తే మిగతా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీధర్‌కమార్‌లోథ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ అసనాల శ్రీనివాస్, అధ్యాపకులు గడ్డం కృష్ణ, మధుకర్, సదాశివ, వి. నవీన్, టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కిరణ్‌కుమార్, జిల్లా బాధ్యులు చంద్రయ్య, టీపీటీఎఫ్ బాధ్యులు రఘుపతి, లక్ష్మయ్య పాల్గొన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి
కేయూలో ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment