![తెలంగాణ బడిలో ఒడిశా విద్యార్థులు..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mbd302-330031_mr-1739216956-0.jpg.webp?itok=A-7apt7I)
తెలంగాణ బడిలో ఒడిశా విద్యార్థులు..
కేసముద్రం: ఇటుక బట్టీలో పని చేసేందుకు వచ్చిన ఒడిశా కార్మికులను ఒప్పించి, వారి పిల్లలను బడిలో చేర్పించారు.. వారికి అర్థమయ్యే భాష హిందీ లోనే పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం యూపీఎస్ టీచర్లు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహమూద్‌పట్నం ఉమ్మడి జీపీ పరిధి కాలనీతండా సమీపంలోని ఇటుకబట్టీలో పనిచేసేందుకు ఇటీవల ఒడిశాకు చెందిన కొంతమంది కార్మికులు కుటుంబాలతో సహా వచ్చారు. తల్లిదండ్రులు పనులు చేస్తుండగా, బడిలో ఉండాల్సిన పిల్లలు వారివెంటే ఉంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న మహమూద్‌పట్నం యూపీఎస్ హెచ్‌ఎం సురేశ్‌నాయుడు, టీచర్ సండ్ర రాధిక, సీఆర్‌పీ సుల్తానా వెళ్లారు. ‘ మీ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మా బడికి పంపించండి’ అంటూ కార్మికులకు చెప్పారు. దీంతో 14 మంది పిల్లలను తల్లిదండ్రులు సోమవారం పాఠశాలలో చేర్పించారు. ఆ పిల్లలకు హెచ్‌ఎం సురేశ్‌నాయుడు, టీచర్ రాధిక, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ కే.ఉమారాణి విద్యాసామగ్రి అందజేశారు. పిల్లలకు అర్థమయ్యే భాష హిందీలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. కాగా, ఒడిశా పిల్లలను ఇక్కడి పాఠశాలలో చేర్పించడమేకాకుండా వారికి అర్థమయ్యే భాష హిందీలోనే బోధిస్తున్న ఉపాధ్యాయులను గ్రామస్తులు, విద్యావంతులు అభినందించారు.
పాఠశాలలో చేర్పించిన
మహమూద్‌పట్నం ఉపాధ్యాయులు
పిల్లలకు అర్థమయ్యే భాష హిందీలోనే బోధన
Comments
Please login to add a commentAdd a comment