ప్రోత్సహించేందుకే రాష్ట్ర స్థాయి క్రీడలు
నెల్లికుదురు : మారుమూల ప్రాంతాల నుంచి జాతీ య స్థాయి క్రీడల్లో ఎదిగేందుకే ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌జీఎఫ్‌ఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడల రాష్ట్ర పరిశీలకుడు కృష్ణమూర్తి విద్యార్థులకు సూచించారు. నెల్లికుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 68వ ఎస్‌జీఎఫ్‌ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 14, 17 బాలబాలికల నెట్‌బాల్ ఎంపిక పోటీలు, తపక్ సెక్రా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్ బాల్ క్రీడా ఎంపిక పోటీలో పాల్గొన్న 300 మందిలో 48 మంది విజేతలను గుర్తించి కేసముద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటార ని తెలిపారు. తపక్ సెక్రా రాష్ట్ర స్థాయి అండర్ 17, 19 బాలబాలికల విభాగం క్రీడాపోటీ ఎంపికలో పాల్గొన్న 200 మంది క్రీడాకారుల్లో ఉత్తమ ప్రతిభకనబర్చిన 40 మందిని ఎంపిక చేసి ఈ నెల 23 నుంచి 25 వరకు నాగాలాండ్ రాష్ట్రం కోహిమా, మణిపూర్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు చదువు తోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం విజేతలకు గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలతో పాటు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో క్రీడా ని ర్వాహకులు సీహెచ్.అయిలయ్య, పీడీలు కొప్పుల శంకర్, సునీత, సురేశ్, వెంకన్న, ప్రణయ్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్‌ఐ ఆర్గనైజింగ్
సెక్రటరీ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment