కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం..
● పస్రాలో ఘటన
గోవిందరావుపేట: ఓ వ్యక్తి బైక్‌పై రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని పస్రాలో జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పస్రా గ్రామానికి చెందిన మద్దారపు వెంకటేశ్వర్లు (55) బైక్‌పై పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 కి సమాచారం ఇవ్వగా ఆలస్యం కావడంతో ఓ ప్రైవేట్ వాహనంలో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని సిబ్బంది తెలిపారు. కాగా, పలు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో 108కు సమాచారం ఇచ్చినా చాలా ఆలస్యంగా వస్తున్నాయని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు 108 వాహన విషయంలో నిర్లక్ష్యం వదిలి, సకాలంలో స్పందించి క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి ..
కమలాపూర్: హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లికి చెందిన మంద రవి (48) ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ్ర కుమారస్వామి తన ట్రాక్టర్‌పై గడ్డి కట్టల పని కోసం శనివారం మంద రవిని తీసుకెళ్లి అదే రోజు రాత్రి వ స్తున్నాడు. ఈ క్రమంలో కుమారస్వామి ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపాడు. దీంతో కమలాపూర్ మండలంలోని మాదన్నపేట శివారులో ట్రాక్టర్ మడ్‌గేర్‌పై కూర్చున్న రవి కింద పడిపోగా అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు వినేశ్ ఫిర్యాదు మేరకు కొండ్ర కుమారస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు..
ములుగు రూరల్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సర్వాపూర్ పంచాయతీ పరిధి జగ్గన్నగూడెంలో చోటు చేసుకుంది. జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన రైతు కొ ట్టెం పెద్ద సమ్మయ్య (55) పంట చేనుకు నీళ్లు పారించేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కాగా, ప్రభుత్వం.. పెద్ద సమ్మయ్య కుటుంబాన్ని ఆదుకుని రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం నాయకుడు గుండబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment