బీఆర్ఎస్ను విమర్శించడానికే సభ పెట్టారు
హన్మకొండ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును తిట్టడానికి, విమర్శించడానికే హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టినట్లు ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి చివరకు కేసీఆర్ ఆనవాళ్లనే ప్రారంభించడానికి వచ్చారని ఆయన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఈ ముచ్చట చెప్పడానికి ప్రభుత్వ ధనంతో ఇంతపెద్ద సభపెట్టడం ఎందుకని, ఈ ముచ్చటే చెప్పాలంటే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది కదా అని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పి, చెప్పుకోవడానికి విజయాలు ఏమీ లేక ఇందిరా మహిళా శక్తి అని చివరి నిమిషంలో సభ పేరు మార్చారని తూర్పారబట్టారు.
పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment