ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులతో అనివార్య పరిస్థితుల్లోనే ఈనెల 19నుంచి నిరవధికంగా కళాశాలలను బంద్ చేస్తున్నట్లు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు ఈనెల 18న కేయూ ప్రతాప్‌రెడ్డికి నోటీసు ఇచ్చిన విషయం విఽధితమే. అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కూడా నిర్వహించలేదు. అలాగే, ఈనెల 26నుంచి నిర్వహించబోయే డిగ్రీ మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించబోమని ఇప్పటికే ఆ అసోసియేషన్ ప్రకటించింది.
ఎస్‌ఆర్, వాగ్దేవి ఎంఓయూ
మామనూరు: వరంగల్‌లోని ఎస్‌ఆర్ యూని వర్సిటీ, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళా శాలల మధ్య విద్య, పరిశోధన, సాంస్కృతిక మార్పిడిపై (ఎంఓయూ) అవగాహన ఒప్పందం జరిగిందని రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ అసోసియేట్ డీన్ డాక్టర్ రాజు తెలిపారు. ఈమేరకు మంగళవారం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇరు కాలేజీల అధిపతులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఎస్‌ఆర్, వాగ్దేవి కళాశాలల ప్రొఫెసర్లు ప్రకాశ్, సయ్యద్ ముస్తాక్, బాలాజీ మారమ్, సందీప్ భట్టాచార్య, గిరిరాజన్, రేఖ గంగుల, నవీన్, దినేశ్, మనోహర్, పూర్ణచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment