పత్తి రైతులతో వ్యవసాయ మంత్రి ముఖాముఖి
వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా మద్దతు ధరతో చేపడుతున్న పత్తి కొనుగోళ్లపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడినట్లు తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ తెలిపారు. వరంగల్‌లోని ఆదిత్య సాయి కాటన్ స్పిన్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులో పత్తి రైతులతో మంగళవారం ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఐ మద్దతు ధరతో పత్తి కొనుగోలు, అమ్మకాలు, చెల్లింపుల విషయంలో రైతు సమస్యల గురించి మంత్రి తెలుసుకున్నారు. దీనికి రైతులు స్పందిస్తూ మద్దతు ధర కొనుగోళ్లలో తేమ శాతం, దిగుమతి, తూకం, చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ముందు కూడా ఇదే విధానం కొనసాగించాలని సంబంధిత మార్కెట్ అధికారులు, సీసీఐ అధికారులను, కాటన్ అసోసియేషన్ అధ్యక్షులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ ఆర్‌జేడీ ఉప్పల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, డీఎంఓ సురేఖ, వరంగల్ మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment