వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Published Wed, Nov 20 2024 1:29 AM | Last Updated on Wed, Nov 20 2024 1:29 AM

-

రఘునాథపాలెం: భర్త, అత్తామామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఓ వివా హిత బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ కథనం ప్రకారం.. రఘునాథపాలెం మండలం ఈర్లపుడికి చెందిన గుగులోత్‌ బాలాజీతో మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ముట్టితండాకు చెందిన అనూష(28)కు 2018లో వివాహం జరిగింది. కొంతకాలంగా అనూషను ఆమె భర్త, అత్తామామలు భద్రి, మంగ్య అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 6న ఆత్మహత్యకు య త్నించగా గమనించిన కుటుంబీకులు ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అనూష తండ్రి రూప్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement