వరంగల్‌లో నార్కొటిక్ పీఎస్..
● రిమోట్‌తో ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
వరంగల్: వరంగల్ ములుగురోడ్డు సమీపంలోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(ఏఎన్‌బీ)పోలీస్‌స్టేషన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్ట్స్‌కాలేజీ మైదానంలోని మహిళా శక్తి ప్రాంగణం నుంచి రిమోట్‌తో మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం యాంటీ నార్కొటిక్ బ్యూరో విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్‌లకు ఈ పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ విభాగానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కార్యాలయాలు ఉండగా.. వరంగల్‌లో మాత్రం వరంగల్ కమిషనరేట్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ డైరెక్టర్ చొరవతో వరంగల్‌లో ప్రభుత్వం ఇటీవల ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ప్రత్యేకంగా ఈ పోలీస్ స్టేషన్‌కు పాత భవనం కేటాయించగా మరమ్మతులు చేశారు. అనంతరం ఈ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ పోలీస్‌స్టేషన్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో మత్తు, గంజాయి పదార్థాల నివారణకు కృషి చేస్తుందని వరంగల్ ఏఎన్‌బీ డీఎస్పీ సైదులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment