గుప్తనిధుల తవ్వకాల వెనుక ప్రముఖుల హస్తం?
బయ్యారం: కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు కట్టపై గుప్తనిధుల కోసం ఇటీవల జరిగిన తవ్వకాల వెనుక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ విగ్రహం పక్కకు తీసి కొందరు వ్యక్తులు జేసీబీ ద్వారా తవ్వకాలు జరిపారు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారగా ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆచూకీకి ఆధారంగా మారిన జేసీబీ..
చెరువు కట్టపై గుప్తనిధుల కోసం వచ్చిన వారు జేసీబీని ఉపయోగించారు. తద్వారా ఆ యంత్రం ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంపై జిల్లా సీసీఎస్, స్థానిక పోలీస్ అధికారులు పలు సీసీ కెమెరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ కెమెరాల ఆధారంగా ఖమ్మంకు చెందిన జేసీబీగా పోలీస్ అఽధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారాలతో నిందితులను సైతం గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది.
జేసీబీని స్టేషన్‌కు తీసుకురావడంపై హైడ్రామా..
గుప్తనిధుల తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీని స్టేషన్‌కు తీసుకొచ్చే విషయంపై హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఇందులో కలగజేసుకుని జేసీబీని స్టేషన్‌కు రాకుండా వెనక్కి పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మళ్లీ జేసీబీని స్టేషన్‌కు తీసుకొచ్చేలా ఆ దేశాలు జారీ చేశారని సమాచారం. ఇందులో భాగంగా జేసీ బీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
తవ్వకాల్లో పెద్దల హస్తం ఉందా?
గుప్తనిధుల తవ్వకాల్లో పెద్దల హస్తం ఉందా అనే చర్చ మండలంలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు పెద్దలు ఈ ఘటనలో పాల్గొన్నారని, అందుకే జేసీబీని తప్పించే యత్నాన్ని అధికారపార్టీకి చెందిన పెద్దల ద్వారా చేరవేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పోలీ సులు గుప్తనిధుల తవ్వకాలపై అసలు విషయాలు వెల్లడిస్తేనే ఇందులో ఎవరి పాత్ర ఏమిటో తెలిసే అవకాశం ఉంది.
దర్యాప్తు చేపడుతున్నాం..
గుప్త నిధుల తవ్వకాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, యంత్రాలపై దర్యాప్తు చేపడుతున్నాం. విచారణలో భాగంగా జేసీబీని గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చాం. ఇందులో ప్రమేయమున్న వ్యక్తుల వివరాల ఆధారాలు సేకరిస్తున్నాం. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తాం. – తిరుపతి, ఎస్సై, బయ్యారం
తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీని
దారి మళ్లించేందుకు యత్నం
పోలీసు ఉన్నతాధికారులు ఒప్పుకోకపోవడంతో స్టేషన్‌కు చేరిన యంత్రం
మండలంలో చర్చనీయాంశంగా మారిన అధికార పార్టీ నేతల ప్రమేయం
Comments
Please login to add a commentAdd a comment