● మౌలాలి–కొల్లం మధ్య 12 సర్వీసులు
● రేపటి నుంచి ప్రారంభం..
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా కేరళలోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులు, భ క్తుల సౌకర్యార్థం మౌలాలి –కొల్లం మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల సర్వీసుల వివరాలు..
మౌలాలి–కొల్లం ప్రత్యేక రైలు: ఈనెల 22, 29, డిసెంబర్ 6,13,20,27వ తేదీల్లో మౌలాలి–కొల్లం (07143) ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం మౌలాలిలో 11.30 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు 13.28 గంటలకు చేరుకుంటుంది. కొల్లంకు శనివారం రాత్రి 7.00 గంటలకు చేరుతుంది.
కొల్లం–మౌలాలి: కొల్లం–మౌలాలి (07144) ఎక్స్‌ప్రెస్ ఈనెల 24, డిసెంబర్ 1,8, 15, 22, 29వ తేదీల్లో కొల్లంలో ఆదివారం తెల్లవారుజామున 02.30 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 06.03 గంటలకు కాజీపేటకు చేకుంటుంది. 10.00 గంటలకు మౌలాలికి చేరుతుంది.
హాల్టింగ్ స్టేషన్లు..
చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట, కట్‌పడి జంక్షన్, జోలర్‌పెట్టి, సెలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూరు జంక్షన్, పాల్‌క్కడ్ జంక్షన్, త్రిషుర్, అలువ, ఎర్నాకులం టౌన్, ఇట్టుమనుర్, కొట్టాయం, చెంగనసెర్రిచ తిరువల్ల, చెంగనూర్, కాయన్‌కులం జంక్షన్ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment