పొంగిపొర్లిన ట్యాంకు నీళ్లు
కురవి: మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నీళ్లు పొంగిపొర్లడంతో ధాన్యం తడిసిముద్దయిన ఘనట మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కురవి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని మూడు రోజులుగా తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు. నాగన్న గుడి ఆవరణలో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఉంది. రోజు మాదిరిగానే భగీరథ నీటిని ట్యాంకులోకి ఎక్కించారు. అయితే అది నిండి రాత్రంతా పొంగిపొర్లిన నీటితో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. బుధవారం ఉదయం రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు నానాపాట్లు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని సొసైటీ అధికారులు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు అత్తునూరి లక్ష్మి, సీతయ్యతోపాటు మరికొందరు రైతులు వేడుకుంన్నారు.
తడిసి ముద్దయిన ధాన్యం
Comments
Please login to add a commentAdd a comment