రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గూడూరు:ధాన్యం కొనుగోలు కేందాల్లో నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మండలంలోని అయోధ్యపురం, గూడూ రులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ శ్వేత, ఐకేపీ ఏపీఎం రవీందర్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కేసముద్రం: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని రకాల వసతులు కల్పించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని ఉప్పరపల్లి, కేసముద్రంవిలేజ్, కల్వల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లు, ధాన్యంలోని తేమను పరిశీలించారు. ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఎర్రయ్య, ఏఓ వెంకన్న, సీఈఓ వెంకటాచలం, గోపాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సహకరించాలి..
మహబూబాబాద్ రూరల్:ఽదాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఏఓ తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, ఏపీఎం తిలక్, ఏపీఓ రమేష్ రెడ్డి, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment