గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనం ద్వారా మేధాశక్తి పెరుగుతుందని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. స్థానిక జిల్లా గ్రంథాలయంలో బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం రిటైర్డ్ గ్రంథ పాలకులు లక్ష్మణ్, నరేందర్, ఉప్పలయ్యను అదనపు కలెక్టర్ సన్మానించారు. తర్వాత విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాంనర్సయ్య, విజేందర్, వీరేందర్, భూలక్ష్మి, భాస్కర్, అభిషేక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
మహబూబాబాద్ రూరల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ జి. మురళీధర్ అన్నారు. మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామంలోని ఆయుష్మాన్ మందిర్ (సబ్ సెంటర్)ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నా రు. గర్భిణులను ట్యాగ్ ఫెసిలిటీస్‌కు పంపించాలని, 102 వాహనాన్ని వినియోగించుకోవా లన్నారు. పుట్టిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. 12 వారాల్లో గర్భిణులను నమోదు చేయాలని, రెండు వారాలకు మించి దగ్గు ఉంటే తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్షయను త్వరగా గుర్తించి ఆరునెలల వరకు మందులు వాడితే వ్యాధి నయమవుతుందని తెలిపారు. రికార్డులను పరిశీలించి అన్ని ఆన్‌లైన్‌లో నమో దు చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ద్రోహి
సీఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడని, ఆయన చేసి ఉద్యమాలేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన నీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రస్తుత కేంద్ర మంత్రికిషన్‌రెడ్డి కృషి చేశారని, పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావాలని నిరాహార దీక్ష చేశారని అన్నారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలకు పెద్దపీట వేసే కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు మోసంగి మురళి, ధర్మారపు వెంకన్న, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాధవపెద్ది శశివర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, జిల్లా కార్యదర్శి భాను శ్రీనునాయక్ పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన
డీఈఓ రవీందర్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీఈఓగా వ్యవహరిస్తున్న రాజేశ్వర్ యథావిధిగా ఏఈడీగా విధులు నిర్వర్తించనున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓ రవీందర్‌రెడ్డిని విద్యాశాఖ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment