సిద్ధు..‘అనాథ’
హీరోలుగా రాణిస్తున్న నర్సంపేట నియోజకవర్గ వాసులు
అనిల్ నటన అద్భుతం..
బూరగాని అనిల్‌ది నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రం. తల్లిదండ్రులు బూరగాని కొమురయ్య–రమాదేవి. అనిల్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాపై ఆసక్తి ఉండడంతో ఆ రంగం వైపు వెళ్లాడు. పలువురి వద్దకు వెళ్లి తన ప్రతిభను తెలియజేశాడు. వారికి అనిల్ నటన నచ్చడంతో అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్ ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2017న విడుదలైంది. ఇందులో అనిల్ అద్భుత నటనకు పలువురు ముగ్థులయ్యారు. రెండో సినిమా ‘ఇరావణ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రేమతో మీ అభిరామ్, దునియా, ప్రేమకుజై, తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు అనిల్ చెప్పాడు. కాగా, టీవీషోలు అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, రాజేశ్వరివిల్లాస్ కాఫీ క్లబ్, అనుపల్లవి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి సీరియల్‌లో నటిస్తున్నట్లు అనిల్ తెలిపారు.
భూక్య సిద్ధు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనలో ఉన్న నటనా ప్రావీణ్యంతో సినిమా రంగంలో రాణించాలని 13 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అదృష్టం వరించింది. వారం రోజుల క్రితం ‘అనాఽథ’ అనే సినిమాను నిర్మించి హీరోగా వెండి తెరకు పరిచమయ్యాడు. మొదటి సినిమాలోనే మంచి నటన ప్రావీణ్యం కనబర్చడంతో ఈ సినిమా పలువురిని ఆకట్టుకుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన సకృ, సరోజన దంపతుల కుమారుడు సిద్ధు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా రాణిస్తూ గోనేంద్ర ఫిలింస్ సంస్థ ద్వారా అనాథ సినిమాను తెలుగు, కన్నడంలో తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రెండో సినిమా కూడా తీస్తున్నట్లు సిద్ధు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment