‘రియల్’ రంగం నుంచి హీరోగా..
రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూనే సినిమా హీరోగా గుర్తింపు పొందాలనే తపనతో వెండి తెరకు పరిచయమయ్యాడు నర్సంపేట నియోజకవర్గంలోని గుర్రాలగండి రాజపల్లి గ్రామానికి చెందిన బూస కుమార్. సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను కలిసినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తానే స్వయంగా ‘షాన్’ అనే సినిమాను రూపొందించాడు. ఇందులో తనే హీరోగా నటించాడు. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి గత సంవత్సరం తన అదృష్టం పరీక్షించుకున్నాడు. వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ చేసి తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా పూర్తి చేశాడు. అనంతరం విడుదల చేసి సఫలీకృతుడయ్యాడు. ప్రస్తుతం మరో సినిమా కూడా చేస్తున్నట్లు ‘సాక్షి’కి వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment