జామాయిల్‌ తోటను ధ్వంసం చేసిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

జామాయిల్‌ తోటను ధ్వంసం చేసిన అధికారులు

Published Thu, Dec 12 2024 9:01 AM | Last Updated on Thu, Dec 12 2024 9:01 AM

జామాయిల్‌ తోటను ధ్వంసం చేసిన అధికారులు

జామాయిల్‌ తోటను ధ్వంసం చేసిన అధికారులు

కురవి : సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలోని జామాయిల్‌ తోటను పెద్ద టవర్‌లైన్‌ను పర్యవేక్షించే అధికారుల బృందం సమాచారం ఇవ్వకుండా నరికేసిన (ధ్వంసం) ఘటన బుధవారం వెలుగుచూసింది. కురవికి చెందిన రైతు నూతక్కి సాంబశివరావు సర్వేనంబర్‌ 345, 346, 347 భూముల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో జామాయిల్‌తోట సాగు చేస్తున్నాడు. పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో తోటపైనుంచి వెళ్తున్న పెద్ద టవర్‌లైన్‌కు సంధించిన అధికారులు తమ సిబ్బందితో కలిసి రెండు రోజుల నుంచి రెండు ఎకరాల విస్తీర్ణంలోని తోటను నరికేశారు. ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్‌ తీగలకు అడ్డు ఉంటే సమాచారం ఇస్తే తామే తొలగించుకుంటామన్నారు. సమాచారం ఇవ్వకుండా రెండు ఎకరాల్లో సుమారు రూ.2లక్షల విలువైన చెట్లను ధ్వంసం చేయడం అన్యాయమని లబోదిబోమన్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

లబోదిబోమన్న రైతు

రూ.2లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement