కాజీపేట మీదుగా కుంభమేళా యాత్ర రైలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా మహా కుంభమేళా యాత్ర రైలును 2025 జనవరి 19న ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం ఎగ్జి క్యూటివ్ పవన్‌సెంగర్ తెలిపారు. కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లో జనవరి, ఫిబ్రవరిలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాను పురస్కరించుకుని భారత్ గౌరవ్ టూరిస్ట్ స్పెషల్ ట్రైన్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర 7 రాత్రులు, 8 రోజలు కొనసాగుతుందన్నారు. ప్రారంభ ధర రూ.22 వేల ప్యాకేజీ ఉంటుందని తెలిపారు. ఈ యాత్ర రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఇతర వివరాలకు 92810 30711,9701360701, 9281030749 నంబర్లు, వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఆర్‌సీటీసీటూరిజం.కామ్.లో సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐఆర్‌సీటీసీ టూరిజం మానిటర్స్ నరేశ్‌బాబు, కె.ప్రశాంత్ పాల్గొన్నారు.
కాజీపేట జంక్షన్ మీదుగా గౌరవ్ ప్రత్యేక రైలు
కాజీపేట జంక్షన్‌కు బుధవారం ఐఆర్‌సీటీసీ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైలు చేరుకుంది. ఈ ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్ నుంచి 30 మంది యాత్రికులు బయలుదేరి వెళ్తున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
జనవరి 19న ప్రయాణం..
3 పుణ్యక్షేత్రాల సందర్శన
Comments
Please login to add a commentAdd a comment