మూసుకుపోయిన డ్రెయినేజీ
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్డులో ప్రధాన డ్రెయినేజీ మూసుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీని అస్తవ్యస్తంగా నిర్మించారు. దీనికి తోడు కొందరు చిరువ్యాపారులు డ్రెయినేజీని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో మురుగునీరు వెళ్లకుండా నిలవడం, డ్రెయినేజీలో వ్యర్థాలు పేరుకుపోవడంతో తీవర దుర్గంధం వెదజల్లుతోంది. ఇదిలా ఉండగా డ్రెయినేజీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం నిలిచిపోయింది.
ఆక్రమణ..
కొన్నిచోట్ల చాలామంది వ్యాపారులు డ్రెయినేజీని ఆక్రమించి పైభాగంలో నిర్మాణాలు చేపట్టారు. డ్రెయినేజీపై కవర్ స్లాబ్ నిర్మించి తోపుడు బండ్లు పెట్టడంతో లోపల పేరుకుపోయిన మురుగునీరు, వ్యర్థాలను తొలగించే అవకాశం లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగల బెడదతో ఈ ప్రాంతవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. డ్రెయినేజీ పక్కనే హోటళ్లు, టీస్టాళ్లు, పండ్ల దుకాణాలు, కిరాణషాపులు ఉండటంతో ఇక్కడికి వచ్చే ఇతర ప్రాంతాల వారు దుర్గంధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డ్రెయినేజీపై ఆక్రమణలు తొలగించి నిత్యం డ్రెయినేజీని శుభ్రపర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దుర్గంధం వెదజల్లుతోంది..
మెయిన్ రోడ్డులో డ్రెయినేజీని శుభ్రం చేయకపోవడంతో దుర్గంధంతో రోడ్డు పై నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి డ్రెయినేజీపై ఆ క్రమణలు తొలగించి, ప్రతీరోజు శుభ్రపర్చాలి.
– ఖాదర్‌బాబా,
కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు
దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment