గడువులోగా సర్వే పూర్తి చేయాలి
● ముఖ్య ప్రణాళిక అధికారి సుబ్బారావు
మహబూబాబాద్: పంటల దిగుబడితో పాటు ఇతర వివరాలపై గడువులోగా సర్వే పూర్తి చేయాలని ముఖ్య ప్రణాళిక అధికారి సుబ్బారావు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం 11వ ప్ర పంచ వ్యవసాయ గణనపై వ్యవసాయ అధికా రులు, విస్తరణాధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఓ మాట్లాడుతూ.. మూడు దశల్లో సర్వే జరుగుతుందని, సర్వేల ఆధారంగా పంటల సాగు వివరాలతో పాటు దిగుబడి వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల మా ట్లాడుతూ.. మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఇవ్వ డం జరిగిందని, యాప్‌లో వివరాలను ఎలా నమోదు చేయాలో వివరించామన్నారు.
సోమశేఖర్‌కు ‘భారత సేవా
రత్న’ పురస్కారం
తొర్రూరు: వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గానూ తొర్రూరు వాసి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జిలుకర సోమశేఖర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన కృషిని గుర్తించి నేషనల్ హ్యూమన్‌రైట్స్ కమిషన్ ‘భారత సేవా రత్న’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. తాజాగా హనుమకొండలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ జి. శ్రీనివాసరావు సోమశేఖర్‌కు పురస్కారం అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, క్లిష్టమైన ఆపరేషన్లను చేయడం వంటి వైద్య సేవలను గుర్తించిన కమిషన్ ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. కాగా పురస్కారం తన బాధ్యతను పెంచిందని, భవిష్యత్‌లో పేదలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తానని డాక్టర్ సోమశేఖర్ తెలిపారు. ఆయన ప్రస్తుతం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో వైద్యులుగా సేవలందిస్తున్నారు.
కుష్ఠు బాధితులపై
వివక్ష విడనాడాలి
● డీఎంహెచ్‌ఓ మురళీధర్
తొర్రూరు: కుష్ఠు బాధితులపై వివక్షను విడనాడాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పెద్దవంగర లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కుష్ఠు బాధితులకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. వైద్యులు జ్వలిత, మీరాజ్, ప్రియాంక, మానస, నందన చేయూతతో అందజేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధిని వందశాతం అరికట్టడంలో భాగంగా అనుమానితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలను గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీవీబీడీ పీఓ సుధీర్‌రెడ్డి, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్, రేణుక, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతానికి
కృషి చేయాలి
● డీఈఓ రవీందర్‌రెడ్డి
తొర్రూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. లయన్స్ టీచర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ బడుల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు సంస్థలు కృషి చేయడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చయ్య, క్లబ్ అధ్యక్షుడు చింతల సురేష్, చార్టర్ ప్రెసిడెంట్ సూరం ఉపేందర్‌రెడ్డి, ప్రతినిధులు వేలూరి శారద, రేగూరి శ్రీదేవి, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment