అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించాలి
నయీంనగర్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదించాలని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి కాలాయాపన చేస్తున్నాడని దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి 30 ఏళ్లుగా దళితుల హక్కులను దోచుకుంటున్నాడని, ఒక్క మాదిగకు సాయం చేయలేదని విమర్శించారు. నమ్మక ద్రోహానికి కడియం శ్రీహరి బ్రాండ్ అంబాసిడర్ అని, తనపై కక్షతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని ధ్వజమెత్తారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
Comments
Please login to add a commentAdd a comment