కోడెల పంపిణీపై క్షేత్రస్థాయి పరిశీలన
గీసుకొండ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాల నుంచి రైతులకు పంపిణీ చేసిన కోడెల విషయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి గోశాల సూపరింటెండెంట్ వి. నర్సయ్య, క్లర్క్ జి. రవి సోమవారం గీసుకొండ మండలానికి వచ్చారు. రాజన్న కోడెలను మనుగొండకు చెందిన మాదాసి రాంబాబుతో పాటు అనంతారం గ్రామానికి చెందిన మంద స్వామి, పసునూటి శ్యాంసుందర్ అనే వ్యక్తులు రైతుల పేర తీసుకొచ్చి కబేళాలకు అమ్ముకున్నారనే విషయం బయటపడడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే రైతుల పేరిట పంపిణీ చేసిన కోడెలు వారి వద్ద ఉన్నాయా లేదా అనే విషయం క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి సూపరింటెండెంట్ రికార్డులను వెంట తీసుకొచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుత ఏడాది మొత్తం 42 మందికి 86 కోడెలను పంపిణీ చేశామని తెలిపారు. అక్రమాలు వెలుగు చూసిన మనుగొండలో 9 మంది రైతులకు 18, అనంతారంలో పది మంది రైతులకు 20 కోడెలను పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉందన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే సదరు రైతుల వద్ద కోడెలు లేవని తేలిందని, తాము గమనించిన విషయాలను వేములవాడ అధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు. కాగా, కోడెల్లో కొన్ని మృత్యువాత పడ్డా యని రాంబాబు చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనుగొండలో అతడి చేను వద్ద గీసుకొండ ఎస్సై కుమార్ సమక్షంలో మండల పశువైద్యాధికారి శ్రీకాంత్‌రెడ్డి.. పూడ్చిన గోతిని తవ్వగా అందులో కోడె కళేబరం ఉన్నట్లు గురించారు.
మనుగొండ, అనంతారంలో ఆరా తీసిన వేములవాడ గోశాల అధికారి
Comments
Please login to add a commentAdd a comment