విద్యార్థులకు పచ్చడి మెతుకులే దిక్కు..
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో మెనూ పాటించడం లేదు. విద్యార్థులకు బుధవారం ఉదయం అన్నం, టమాట పచ్చడితో సరిపెట్టారు. సాధారణంగా ఉదయం అల్పాహారం, రాగిజావ అందించాలి. కాగా వార్డెన్ శ్రీనివాస్ ఉదయం 9గంటల వరకు రాకపోవడంతో విద్యార్థులకు పచ్చడి మెతుకులతో సరిపెట్టారు. దీంతో వార్డెన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించి హాస్టల్‌లో మెనూ ప్రకారం భోజనం అందించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
మెనూ పాటించడం లేదు..
మా హాస్టల్‌లో ప్రతీ రోజు నీళ్ల చారు లేదా పచ్చడి పెడుతారు. ఉదయం మెనూ ప్రకారం రాగి జావ, ఇడ్లీ, ఉప్మా పెట్టడం లేదు. వార్డెన్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. పెద్దసార్లు వచ్చి మా హాస్టల్‌లో మెనూ ప్రకారం భోజనాలు అందించాలని కోరుతున్నాను.
– ఎస్. ప్రవీణ్, హాస్టల్ విద్యార్థి
ఉదయం 9గంటల వరకు
కూడా రాని వార్డెన్
ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో
అమలు కాని మెనూ
Comments
Please login to add a commentAdd a comment