మందుల్లేవ్!
ఆర్టీసీ బస్సుల్లో ప్రశ్నార్థకంగా ప్రథమచికిత్స
● నామమాత్రంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు
● క్షతగాత్రులకు అందని ప్రథమ చికిత్స
● పట్టించుకోని సంస్థ అధికారులు
బాక్సులు
ఉన్నప్పటికీ..
బస్సుల్లో బాక్సులు ఏర్పా టు చేసినప్పటికీ వాటిలో మందులు ఉండటం లేదు. తొర్రూరు, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలకు చెందిన ఏ బస్సులో కూడా మందులు కనిపించడం లేదు. రెండు డిపోల్లో 94 ప్రభుత్వ సర్వీసులు నడుస్తుండగా, 67 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో పేరుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నా వాటిలో మందులు మాత్రం పెట్టడం లేదు.
తొర్రూరు: ప్రయాణికుల భద్రతే లక్ష్యం, వారి సంఖ్య పెంచడమే ధ్యేయం అని చెప్పే ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అయితే బస్సుల్లో బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారే తప్ప మందులు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఖాళీగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు..
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సుల్లో బా క్సులను ఏర్పాటు చేసింది. అయితే బాక్సుల్లో మందులు లేకపోవడంతో ప్రమాద సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రథమ చికిత్స అందడం లేదు. రవాణా శాఖ అధికారులు బస్సులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాత్రమే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కానీ అందులో మందులు ఉంటున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయడంతో పాటు మందులు ఉండేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జిల్లాలోని బస్సుల వివరాలు
తొర్రూరు మహబూబాబాద్
డిపో డిపో
ప్రభుత్వ బస్సులు 51 43
అద్దె బస్సులు 43 24
Comments
Please login to add a commentAdd a comment