సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్దానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. కాగా బుధవారం సీపీఎం నాయకులు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. తక్షణమే వారికి పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఈనెల 6నుంచి 9వ తేదీ వరకు రిలేనిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఖాదర్, వీరన్న, ఉదయ్, బాబులాల్, ప్రబావతి , జానకీ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment