గుమ్మడిదొడ్డిలో చిరుత సంచారం?
వాజేడు: మండలంలో చిరుత సంచరించిదనే ప్రచారం జరుగుతోంది. మండలంలోని దూలాపురం రేంజ్ పరిధిలోని గుమ్మడి దొడ్డి గ్రామ సమీపంలో రెండు, మూడు రోజుల క్రితం చిరుత పులి సంచరించినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రైతు ఎట్టి దేవదాసు పొలంలో చిరుత పులి పాదముద్రలను పోలిన ముద్రలు కనిపించాయి. విషయాన్ని వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలిపారు. దీంతో వారు బుధవారం పాదముద్రల గుర్తులు ఉన్న చోటుకు వెళ్లి వాటిని సేకరించారు. తోడేలు, లేదా హైనా అయి ఉంటుందని చెబుతున్నారు. కాగా, తోడేలు పాద ముద్రలు అంత పెద్దగా ఉండవని తెలిసింది. పాదముద్రలను గుర్తించడం కోసం ఫొటోలను జూసిబ్బందికి పంపించినట్లు సమాచారం. అయితే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మాత్రం చిరుత పులి అడుగులే అని అనుమానిస్తున్నారు. ఈ విషయం వైరల్ అవుతోంది. ఈ విషయంపై వాజేడు రేంజర్ చంద్రమౌళి, దూలాపురం ఇన్‌చార్జ్ రేంజర్ బాలకృష్ణను ‘సాక్షి’ వివరణ కోరగా అవి చిరుత పులి పాదముద్రలు కావన్నారు. అయితే పరిశీలన కోసం ఫొటోలు జూ సిబ్బందికి పంపామన్నారు. హైనా, తోడేలు, కుక్క, నక్క.. ఇందులో ఏదో ఒక జంతువు పాదముద్రికలు అయి ఉండొచ్చని చెప్పారు.
రైతుపొలంలో పాదముద్రల గుర్తింపు
అయితే హైనా, తోడేలు కావొచ్చంటున్న అటవీశాఖ సిబ్బంది
గుర్తింపు కోసం ఫొటోలు పంపిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment