నర్సింహులపేటలో విషాదఛాయలు
● మాదన్నపేట చెరువులోకి దూసుకెళ్లిన కారు
● మృతుడు అగ్రికల్చర్ ఏఈఓ
నర్సింహులపేట: మండల కేంద్రానికి చెందిన మిర్యాల విష్ణు(25) బుధవారం నర్సంపేటలో జరిగిన తన స్నేహితుడి త మ్ముడి వివాహ వేడుకకు హాజరయ్యాడు. సమీపంలోనే మా దన్నపేట చెరువు ఉండడంతో చూసేందుకు కారులో వెళ్లాడు. మత్తడి సమీపంలో కారు నేరుగా చెరువులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో విష్ణు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మిర్యాల వెంకన్న, పద్మ దంపతుల చిన్న కుమారుడు విష్ణు మండలంలోని జయపురం ఏఈఓగా పని చేస్తున్నాడు. మరిపెడ మండలం చిన్నగూడురు ఏఈఓగా పనిచేసిన విష్ణు.. 5 నెలల క్రితం బదిలీపై సొంత మండలానికి వచ్చా డు. ఈ క్రమంలో ఏఈఓ విష్ణు మృతి చెందడంతో స్నేహితులు, బంధువులు శోకసముద్రంలో మునిగారు. వారం రోజుల క్రితం విష్ణుకు వివాహం కుదిరింది. కారులో ఇదే గ్రామానికి చెందిన పట్నూరి ప్రేమ్‌కుమార్ ఉన్నాడు. చెరువులో పడిన కారులో నుంచి ప్రేమ్‌కుమార్ ప్రాణంతో బయట పడగా.. విష్ణు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment